జల్లికట్టులొ విషాదం

– ఒకరి మృతి, 60మందికి గాయాలు
మదురై : సంక్రాంతి అనగానే తమిళనాడులో గుర్తుకు వచ్చే జల్లికట్టు క్రీడలో విషాదం చోటు చేసుకుంది. మదురై జిల్లాలోని పలమేడు వద్ద జరిగిన ఈ జల్లికట్టులో ఒక యువకుడు మృతి చెందగా 60మంది గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడిన 11మందిని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. మరో 40మందికి ప్రాథమిక చికిత్స చేసి ఇళ్ళకు పంపివేశారని జిల్లా కలెక్టర్‌ అనీష్‌ శేఖర్‌ తెలిపారు. ఈ జల్లికట్లు నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసేలా 2వేలమందికి పైగా పోలీసు బలగాలను మోహరించినట్లు చెప్పారు. జంతు హక్కుల సంఘాలు, హక్కుల కార్యకర్తల నుండి ఎన్ని నిరసనలు, ఆందోళనలు వ్యక్తమైనా తమిళనాడులో ఈ క్రీడను అధికారికంగా నిర్వహిస్తూనే వుంటారు.

Spread the love