జస్ట్‌ మిస్‌..

ప్రమాదాలకు మారుపేరుగా విశాల్‌ తన పేరుని మరోసారి సార్థకం చేసుకున్నారు. లేటెస్ట్‌గా ఆయన ఓ భారీ ప్రమాదం నుంచి బయటపడి హాట్‌ టాపిక్‌గా నిలిచారు. ఆయన ప్రస్తుతం అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్నారు. ఫైట్‌ని చిత్రీకరిస్తున్న తరుణంలో ఓ భారీ ట్రక్‌ అదుపు తప్పి విశాల్‌తోపాటు జూనియర్‌ ఆర్టిస్టుల వైపు దూసుకొచ్చింది. అదే టైమ్‌లో అందరూ అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. లేకపోతే విశాల్‌ ప్రాణాలు దక్కి ఉండి కావు అంటూ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్‌ చేసి, అందర్నీ షాక్‌కి గురి చేశారు.

Spread the love