జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ విజేతల ప్రకటన

నవతెలంగాణ-కంటేశ్వర్
యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించబడిన జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల విజేతలను సోమవారం ప్రకటించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు గాను మొదటి స్థానంలో అక్షిత, రెండవ స్థానం శ్రీజ జాదవ్ కామారెడ్డి జిల్లా మొదటి స్థానం మౌనిక, రెండవ స్థానంలో రాగవర్శిని గా నిలిచారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, అక్కడ గెలుపోందితే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఆర్హత సాధిస్తారు.ఈ పోటీలకు న్యాయనిర్ణేతగాలుగా కేశవ్ కుమార్, వినయ కుమార్, మోహన్ దాస్, హర్ష రాథోడ్, రవీందర్ రెడ్డి వ్యవహరించారు. విజేతలను నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అభినందించారు. రాష్ట్ర ,జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చాలని సూచించారు.

Spread the love