జీవో-58 అమలు చేయాలి : సీపీఐ

నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా జీవో నెంబర్‌ 58 ద్వారా పేదలకు ఇచ్చిన మాటను నిలబెటు కో వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్‌ కాలనీ సిక్స్‌ ఇంక్లైన్‌ బ్యారెక్స్‌ ఎదురుగా సర్వే నంబర్‌ 280 ప్రభుత్వ భూమి లో పేదలు వేసుకున్న గుడిస వాసుల భూ పోరాటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేండ్ల పాలనలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క పేదకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వలేదని అన్నారు. జీవో 58 ప్రకారం గుడిసె వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వడం లేదని మరో మార్గం లేక భూ పోరాట కార్యక్రమం ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తం గా నిర్వహిస్తున్నామన్నారు. హనుమకొండ, వరంగ ల్‌, పరకాల, రఘునాథపల్లి లాంటి అనేక ప్రాంతా ల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని అన్నారు. భూపాలపల్లిలో ఈ పోరాటం ఐదవ రోజుకు చేరుకున్నదని అన్నారు. పేదలకు భూములు దక్కేంతవరకు గుడిసెవాసులకు అండగా ఉంటామన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సి ఆర్‌ నగర్‌ బాంబులగడ్డలో 25 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ి కరెంటు, రోడ్లు, మంచినీరు ఇచ్చేంతవరకు అండగా నిలిచినట్టు గుర్తు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్‌ 280 ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న సుమారు 2500 మందికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాలు అందజేయాలని, పట్టాలు ఇచ్చేంతవరకు వెనక్కి తగ్గేదేలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిం చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుడుదుల వెంకటేష్‌, కొరిమి సుగుణ, సోతుకు ప్రవీణ్‌, క్యాతరాజ్‌ సతీష్‌, సీపీఐ కౌన్సిలర్‌ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నేరెళ్ల జోసెఫ్‌, వేముల శ్రీకాంత్‌, రాజు , మహేందర్‌, పద్వి,రాజేశ్వరి, సునీత, సజన, అనిత, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రటరీలు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love