నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నార్త్ సిక్కింలోని జైమా వద్ద విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్లు, అధికారుల వాహనం ప్రమాదవశాత్తూ లోయలోపడి పలువురు మరణించటం, మరికొందరు గాయపడటం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఆయన సంతాపాన్ని ప్రకటించారు. ఆయా కుటుంబాల వారికి సానుభూతిని తెలిపారు.