జ్యూట్‌ బోర్డు వద్ద కార్మికుల ధర్నా

– సంఘీభావం తెలిపిన కాంగ్రెస్‌ నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ జ్యూట్‌ కార్మికులు ధర్నాకు దిగారు. శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని బోర్డు కార్యాలయం వద్ద భైఠాయించారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ జ్యూట్‌ బోర్డును కోల్‌కతాలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ నిర్ణ యం కారణంగా తయారీదారులందరూ తీవ్ర భయాందోళనలకు గురవుతు న్నారంటూ టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి కేంద్ర జౌళిశాఖ మంత్రికి లేఖ రాశారు. ధర్నాకు ఖైర తాబాద్‌ జిల్లా అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి, నాయకులు చరణ్‌ కౌశిక్‌, మెట్టు సాయి కుమార్‌ సంఘీభావం తెలిపారు.

Spread the love