టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌


ఢాకా:
భారత్‌, బంగ్లాదేశ్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఇరుజట్ల మధ్య రెండో వన్డే జగనుంది. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టులో స్వల్ప మార్పు జరిగింది. షాబాజ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే నెగ్గిన ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్నది.
సిరీస్‌ నెగ్గాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ బంగ్లాదేశ్‌ గెలిస్తే సిరీస్ చేజారిపోతుంది. తొలి వన్డేలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేక మేడలా కూలిపోయింది. కేఎల్‌ రాహుల్ మినహా ఏ ఒక్కరూ సరైన ప్రదర్శన చేయలేకపోయారు. ఆ తర్వాత బౌలర్‌లు రాణించడంతో భారత్‌ విజయం ఖాయమనించింది. కానీ ఆఖరికి బంగ్లా బ్యాటర్‌లు 10వ వికెట్‌ 50కి పైగా పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత విజయావకాశాలను తుడిచిపెట్టారు.

Spread the love