టీజీవో టీఎస్‌పీఎస్సీ డైరీ ఆవిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) సంఘం టీఎస్‌పీఎస్సీ యూనిట్‌ డైరీని టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ బి జనార్ధన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ నియామకాల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న టీఎస్‌పీఎస్సీ క్యాడర్‌ స్ట్రెంథ్‌ను మంజూరు చేయించాలంటూ ఆ సంఘం నగర అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు ధన్‌సింగ్‌, రవీందర్‌రెడ్డి, లింగారెడ్డి, సత్యనారాయణ, అరుణకుమారి, సుమిత్ర, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, టీజీవో నగర అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు సయీదుద్దీన్‌, మల్లిఖార్జున్‌, కోశాధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love