టీ జూడా నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ కౌశిక్‌

-ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ అఖిల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజూడా) నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నట్టు ఆ అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. అధ్యక్షునిగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ కౌశిక్‌ కుమార్‌ పింజరాల, ప్రధాన కార్యదర్శిగా గాంధీ మెడికల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ ఆర్‌.కె.అఖిల్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్లు డి.సాయినాథ్‌ (కాకతీయ మెడికల్‌ కాలేజీ), డాక్టర్‌ ప్రణరు మోతె (నిజామాబాద్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ (ఆదిలాబాద్‌ రిమ్స్‌) తదితరులు ఎన్నికయ్యారు.

Spread the love