టోల్ ప్లాజా వద్ద బస్సు బీభత్సం..సెక్యూరిటీ గార్డు మృతి

నవతెలంగాణ – యూపీ
యూపీలోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దాద్రి లుహర్లీ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి, వేగంగా వస్తున్న బస్సు సెక్యూరిటీ గార్డును ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. అతివేగంతో వచ్చి, అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌కు చేరుకుని అక్కడున్న గార్డును ఢీకొని, మరో డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ఘటన టోల్ వద్ద అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మినీ బస్సు లుహర్లీ టోల్ వద్ద డివైడర్‌ను బద్దలుకొట్టి మరో లైన్‌కు చేరుకుంది. ఈ ఘటనలో టోల్ సెక్యూరిటీ ఉద్యోగి ఛోటే లాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మినీ బస్సు డ్రైవర్‌ను కూడా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తరలించారు. కాగా ఛోటే లాల్ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love