ట్రెండ్‌ క్రియేట్‌ చేసే సినిమా

గీతానంద్‌, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. ఏ కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్‌ సేన్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ఓ పాపలాగా కేర్‌ తీసుకుని మరీ సినిమా చేశాం. టీజర్‌లోని విజువల్స్‌ మీకు నచ్చాయని భావిస్తున్నాను. మూవీ ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.’ఇది రెగ్యులర్‌ మూవీ కాదు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా మూవీ ఓ మార్క్‌ క్రియేట్‌ చేస్తుందని అనుకుంటున్నాను. ఇందులో ఉన్న యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. యూనిక్‌ పాయింట్‌ ఉన్న కథ’ అని డైరెక్టర్‌ దయానంద్‌ అన్నారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘2013 టైమ్‌లో నేను, దయానంద్‌ 5డీ కెమెరాలతో షార్ట్‌ ఫిలింస్‌ చేసి మా ఐడియాస్‌ను షేర్‌ చేసుకుంటుండేవాళ్లం. ఇప్పుడు తను కూడా ఇండిస్టీలోకి అడుగు పెట్టాడు. గీతానంద్‌, దయానంద్‌లకు ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలి. నిర్మాత రవి మా కాలేజ్‌లోనే చదివారు. టీజర్‌ చాలా ఉంది. రొటీన్‌ సినిమా అయితే కాదు. కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’ అని తెలిపారు. ‘ఈ చిత్ర టీజర్‌ చూడగానే విశ్వక్‌ ఫోన్‌ చేసి టీజర్‌ లాంచ్‌ చేస్తానని అన్నారు. అందుకు ఆయనకు స్పెషల్‌ థాంక్స్‌. ఈ సినిమా ఫలానా అని స్పెషల్‌ లేబుల్స్‌ అని ఇవ్వలేను. ఎందుకంటే ఇదొక కంప్లీట్‌ ప్యాకేజ్‌ మూవీ. ఇన్‌టెన్స్‌ క్యారెక్టర్స్‌ మధ్య జరిగే ఎమోషనల్‌ జర్నీ ఇది’ అని హీరో గీతానంద్‌ అన్నారు.

Spread the love