డబ్ల్యూపిఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) టైటిల్‌ హక్కులను టాటా గ్రూప్‌ దక్కించుకుంది. ఈ లీగ్‌ ఐదు సీజన్లకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్‌గా ఉండనుది. 2027 జూలై వరకు టాటా గ్రూప్‌ టైటిల్‌స్పాన్సర్‌గా కొనసాగుతుంది. డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను టాటా కంపెనీ దక్కించుకున్న విషయాన్ని బుధవారం బిసిసిఐ అధికారింగా ధ్రువీకరించింది. ఈమేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను టాటా గ్రూప్‌ దక్కించుకుందని చెప్పడానికి చాలా సంతోసిస్తున్నా. వాళ్ల మద్దతుతో మహిళా క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తామనే నమ్ముతున్నాం’ అని బిసిసిఐ సెక్రటరీ జై షా ట్వీట్‌ చేశారు. టాటా గ్రూప్‌ ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. డబ్ల్యుపిఎల్‌ మీడియా హక్కులను ఐదేళ్ల కాలానికి వైకోమ్‌-18 సంస్థ చేజిక్కించుకుంది. యుపి వారియర్స్‌ కెప్టెన్‌గా హీలీ డబ్ల్యుపిఎల్‌ ఆరంభ సీజన్‌ యుపి వారియర్స్‌ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన అలేసా హీలీ ఎంపికైంది. ఈ విషయాన్ని యుపి వారియర్స్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇక ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ అయిన హీలీ.. 139 టి20ల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించి 2,500కు పైగా పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ సహా 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే వికెట్‌ కీపర్‌గా 110మంది ప్లేయర్స్‌ను ఔట్‌ చేసింది. యుపి జట్టు: హీలీ(కెప్టెన్‌), ఎక్లేస్టోన్‌, దీప్తి శర్మ, మెక్‌గ్రాత్‌, ఇస్మాయిల్‌, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్‌, పార్శవీ చోప్రా, శ్వేతా సెహ్రావత్‌, యశశ్రీ, కిరణ్‌ నావ్‌గేర్‌, హర్రీస్‌, దేవిక వైద్య, లారెన్‌ బెల్‌, లక్ష్మీ యాదవ్‌, సిమ్రన్‌ షేక్‌.

Spread the love