డార్క్‌ చాక్లెట్ల ఉత్పత్తిలోకి మార్స్‌ రెగ్లీ

న్యూఢిల్లీ : కన్‌ఫెక్షనరీ తయారీలో ఉన్న మార్స్‌ రిగ్లీ ఇండియా కొత్తగా గెలాక్సీ ఫ్యూజన్స్‌ పేరుతో డార్క్‌ చాక్లెట్ల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఐకానిక్‌ గ్లోబల్‌ చాక్లెట్‌ బ్రాండ్‌ల స్థానిక ఉత్పత్తిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ కంపెనీ దేశంలో చాక్లెట్‌లు, చూయింగ్‌ గమ్‌, పుదీనా, స్నాక్స్‌ తయారీలో ఉంది. దేశంలో 70 శాతం కోకోతో గెలాక్సీ ఫ్యూజన్స్‌ డార్క్‌ చాక్లెట్ల విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించింది. ఇవి అన్ని ఈ-కామర్స్‌ పోర్టల్‌లలో రూ.90 నుంచి లభిస్తాయని తెలిపింది.

Spread the love