డా.కె.శాంశికాంత్‌కు రూ.48 లక్షల ప్రాజెక్ట్‌లు మంజూరు

నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధ్యాపకుడు డా.కె. శాంశికాంత్‌ గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), కోర్‌ రీసెర్చ్‌ గ్రాంట్‌ (సీఆర్‌జీ), కింద రెండు పరిశోధనలు చేయడానికి రూ 48 లక్షల ప్రాజెక్ట్‌లు మంజూరు చేశారు. ఆయన పెట్టుకున్న ప్రపోజల్స్‌ను పరిశీలించిన అనంతరం వాటిని పరిశీలించి ” గోదావరి నది బేసిన్‌లో భవిష్యత్తులో నీటి సెక్యూరిటి అంచనా వేయడానికి” పరిశోధన చేసేందుకు రూ. 38 లక్షలు, ”గ్లోబల్‌ వార్మింగ్‌ వలన భవిష్యత్తులో వర్షాభావ పరిస్థి తు’లపై పరిశోధనలకు గాను మరొక రు 10 లక్షలు సాధిం చారు. ఆయన గతంలో యూజీసీ రూ. 2 లక్షల ప్రాజెక్టు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 లక్షలు, ఓయూ నుంచి రూ 80 వేలు ప్రాజెక్టు కింద పొందారు. పై రిసెర్చ్‌ ప్రాజె క్టులు అన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో గతంలో ఓయు వీసీ అప్రిసియేషన్‌ అవార్డ్‌, 2022 ఓయూ వీసీ ఎక్స్‌ లెన్సీ అవార్డు పొందారు. వాతావరణం పై ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి డా.శశికాంత్‌ పీహెచ్‌డీ బాంబే ఐఐటీలో పూర్తి చేసి డౌన్‌ స్కెలింగ్‌ పై నూతన సాఫ్ట్‌వేర్‌ను స్వయంగా అభివద్ధి చేశారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన ఎంత వరకు వర్షపాతం తగ్గుతుందో కనుగొనడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఎంతోగానో దోహదపడుతుందన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ ( ఎన్‌ ఈయు ), వారితో కొలబ్రెటీవ్‌ వర్క్‌ చేయడంతో పాటుగా వారికి డా.శశికాంత్‌ శిక్షణ ఇచ్చారు. ప్రాజెక్ట్‌లు సొంత చేసుకున్న శశికాంత్‌ ను ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు. ఈ ప్రాజెక్టు నిధులతో లోతైన పరిశోధనలు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.

 

Spread the love