– దేశాభివృద్ధిలో బలమైన స్తంభం : ప్రధాని మోడీ
జైపూర్ : ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ-దౌసా-లాల్‌సోట్‌ల మధ్య పూర్తయిన తొలిదశ రహదారిని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు రూ.18,100 కోట్లతో చేపట్టనున్న నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.