తపాలా కార్యాలయాల్లో ఈ నెల 9 , 10న సుకన్య సమృద్ధి యోజన మేళ..

నవతెలంగాణ-డిచ్ పల్లి
బాలికల బంగారు భవిష్యతు కోసం ఈ నెల 9 ,10  వ తేదీల్లో సుకన్య ఖాతాలు తెరిపించాడనికి  అన్ని తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక మేళ నిర్వహిస్తున్నామని నిజామాబాదు సౌత్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మంగళవారం తెలిపారు. 10  సంవత్సరాలు లోపు ఉన్న బాలికల పేరు పైన 250 రూపాయల తో సుకన్య సమృద్ధి ఖాతా ప్రారంభించవచ్చని  అయన తెలిపారు.
సుకన్య సమృద్ధి ఖాతా పైన అత్యధిక వడ్డీ 7.6 %  చక్ర వడ్డీ  లభిస్తుందని, ఉదాహరణ కి  నెల నెల 1000 ఒక వేయ్యి రూపాయల చొప్పున 15  సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్న వడ్డీ ప్రకారం రు. 5లక్షల10 వేల373 లభిస్తాయని సంతోష్ వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరం లో 250 రూపాయల నుంచి 1ఒక లక్షా 5 యాబై వేల రూపాయల వరకు ఎంతైనా జమ చేసుకోవచ్చని తెలిపారు.10 సంవత్సరాలలోపు ఉన్న బాలికల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ కుమార్ ప్రజలను కోరారు.

Spread the love