నవతెలంగాణ-కేసముద్రంరూరల్
కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యం గా వదిలేస్తున్న ఈ రోజుల్లో… తల్లిదండ్రులను తా ము బతికినంతకాలం కళ్లెదుటే నిలుపుకునే విధం గా…తల్లిదండ్రులకు పుత్రులు గుడి కట్టించిన అరు దైన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు జామ్లా తండాలో చోటు చేసుకుంది. కోమటిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ గుగులోతు జమ్లా నాయక్ గత ఏడాది జనవరి 30న దివంగతలయ్యారు. అదే ఏడాది ఆగస్టు 17న జామ లా నాయక్ సతీమణిబుగ్గి దివంగతురాలైంది. జామ్ల నాయక్ బుగ్గి దంపతుల కుమారులు ఖీమా నాయక్, భీమా నాయక్, లింభా నాయక్, వాగ్యానాయక్ తమ తల్లిదండ్రులు దివంగతులై ఏడాది గడిచిన నేపథ్యం లో తల్లిదండ్రుల విగ్రహాలతో గుడి కట్టించాలని నిర్ణ యించి ఆ మేరకు లక్షన్నర వ్యయంతో తండా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో జాంలా నాయక్ బుగ్గి శిలా విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టించా రు. తమ తల్లిదండ్రుల విగ్రహాలతో తాము బతికు న్నంత కాలం కళ్ళుదుటే వారు ఉన్నట్టుగా భావిస్తున్న ట్లు కుమారులు పేర్కొన్నారు. తాతా నాయనమ్మ వి గ్రహాల ఏర్పాటుకు మనవడు మహేందర్ దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేసి నాన్న, పెద్దనాన్న, చిన్నాన్నల ఆ కాంక్షను నెరవేర్చినట్లు చెప్పారు. ఆదివారం జామ లా నాయక్ బుగ్గి దంపతుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన గుడిని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతి కుండగానే తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న సమాజంలో చనిపోయిన తల్లిదండ్రులను గుం డెల్లో పెట్టుకొని నిలుపుకునే ఇలాంటి కొడుకులు ఉం డటం ఎంతో అదృష్టం అన్నారు. దివంగత జామ్లా నాయక్ బుగ్గి శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స ర్పంచ్ నీలం యాకయ్య, మహబూబాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ నేత మురళి నాయక్, మాజీ సొసైటీ చైర్మన్ గడ్డం యాకమూర్తి, రావుల మల్లేశం, కూరెల్లి సతీష్, దివంగత జాంలా నాయక్, బుగ్గి దంపతుల రక్తసంబంధీకులు, తదితరులు పాల్గొన్నారు.