నవతెలంగాణ-డిచ్ పల్లి
యూనివర్సిటీ లో నేలకోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బాలికలకు నూతన హాస్టల్ నిర్మించాలని, స్పోర్ట్స్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, స్పోర్ట్స్ పరికరాలు తీసుకురావాలని, క్యాంటీన్ ప్రారంభించాలని, హాస్టల్ ఇతర సమస్యలన్నిటినీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో బాలికల హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, జయంతిలు మాట్లాడుతూ యూనివర్సిటీ లో బాలికలకు నూతన హాస్టల్ నిర్మించాలని, స్పోర్ట్స్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, స్పోర్ట్స్ పరికరాలు తీసుకురావాలని, క్యాంటీన్ ప్రారంభించాలని, హాస్టల్ మరియు ఇతర సమస్యలన్నిటినీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శివ సాయి, నాయకులు అక్షయ్, ఆకాష్, శేషు, శ్రావణి చిన్నారి తదితరులు పాల్గొన్నారు.