దంత వైద్యుల ధమాకా

– హెచ్‌ఓటీఏ టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ కైవసం
హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దంత వైద్యులు దూకుడు చూపించారు. 2021 హెచ్‌ఓటీఏ టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దంత వైద్యుల జోడీ ప్రదీప్‌ వల్లూరిపల్లి, చిరుమామిల్ల శ్రీరామ్‌.. రెండేండ్ల విరామం అనంతరం అదే వేదికపై చాంపియన్స్‌గా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన 12వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ (40 ప్లస్‌ విభాగం)లో ప్రదీప్‌, శ్రీరామ్‌ టైటిల్‌ సాధించారు. ఫైనల్లో లగ్గని శ్రీనివాస్‌, శివ రామరాజు జోడీపై 10-7తో మెరుపు విజయం సాధించారు. 2021లో శ్రీనివాస్‌, శివరామరాజులకు టైటిల్‌ కోల్పోయిన ప్రదీప్‌, శ్రీరామ్‌.. ఈ ఏడాది వారిని ఓడించి విజేతలుగా నిలిచారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఎం. గాయత్రి, ఏ. చక్రధర్‌ జోడీ టైటిల్‌ ఎగరేసు కుపోయింది. ఫైనల్లో శశికళ, కష్ణా రెడ్డి జోడీపై 8-4తో అలవోక విజయం సాధించారు. ప్రదీప్‌, శ్రీరామ్‌ సహా గాయత్రి, చక్రధర్‌లు వసంత్‌నగర్‌ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు కావటం విశేషం.

Spread the love