– మూడో టెస్టు వేదిక మార్పు !
ముంబయి : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు వేదిగా ధర్మశాల ఆతిథ్య హక్కులు నిలుపుకునే అవకాశాలు కోల్పోయిందని తెలుస్తోంది. 2016-17 పర్యటనలో ఇక్కడ చివరి టెస్టు విజయంతో సిరీస్ దక్కించుకున్న భారత్.. ఈసారి మూడో టెస్టు ధర్మశాలలో ఆడాల్సి ఉంది. కానీ ఇటీవల ధర్మశాల స్టేడియంలో పలు పనులు చేశారు. ఈ క్రమంలో పిచ్‌పై కొన్ని చొట్ల ప్యాచ్ వర్క్ అలాగే ఉండిపోయిందని బీసీసీఐ బృందం నివేదిక ఇచ్చిందని సమాచారం. ఇక్కడ చివరగా నిరుడు భారత్, శ్రీలంక టీ20 మ్యాచ్ జరిగింది. మూడో టెస్టు వేదికగా ధర్మశాల స్థానంలో రాజ్‌కోట్, ఇండోర్‌లను పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆసీస్ కోరినా..! : భారత పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెటర్ల విన్నపాలు తిరస్కరణకు గురవుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు సాధన చేయాలని అనుకున్నప్పటికీ.. క్యూరేటర్ ప్రధాన పిచ్ సహా ప్రాక్టీస్ పిచ్‌లకు వాటరింగ్ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. మూడు రోజుల్లోనే ముగిసిన జామ్తా టెస్టులో.. అదే పిచ్‌పై ఐదురు ఆసీస్ బ్యాటర్లు సాధన చేస్తారని క్యూరేటర్‌కు సమాచారం ఇచ్చారు. అయినా, ఆదివారం సాధనకు వీల్లేకుండా వాటరింగ్ చేశారని ఆసీస్ శిబిరం అంటోంది. నేడు భారత్, ఆస్ట్రేలి యా ఇరు జట్ల ఆటగాళ్లు నాగ్‌పూర్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు రానున్నారు.