నయా సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దు కుంటున్న సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగు తున్నాయి. శ్రీకాంత్‌.ఎన్‌.రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ‘శ్రీ లీల’ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్‌ చిత్ర సమర్ప కులుగా వ్యవహరిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఏప్రిల్‌ 29న ఈ చిత్రం విడుదల అనేది ఈ ప్రచార చిత్రంలో గమనించవచ్చు. తొలిచిత్రంతోనే స్టార్‌గా ప్రేక్షక హదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త మాస్‌ అవతారంలో కనిపించనున్నారని ఈ ప్రచార చిత్రం చూస్తే అనిపిస్తుంది. పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. చిత్ర టైటిల్‌తోపాటు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Spread the love