నాంపల్లి ఎగ్జిబిషన్‌లో సింగరేణి స్టాల్‌ ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ నాంపల్లి జాతీయ ఇండిస్టియల్‌ ఎగ్జిబిషన్‌లో సింగరేణి ప్రాంత మహిళా స్వయం ఉపాధి యూనిట్ల స్టాల్‌ను బుధవారం సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు, జీఎం(కో ఆర్డినేషన్‌) ఎం సురేశ్‌, సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఆశా సురేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నదనీ, అది పూర్తిచేసుకున్న అనేకమంది యువతులు టైలరింగ్‌, పేపర్‌ బ్యాగ్‌లు, ఎంబ్రాయిడరీ, గృహౌపకరణాల తయారీ వంటి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకొని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. వారికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో భాగంగా ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

Spread the love