నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు : డీహెచ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన సెమి క్రిస్మస్‌లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు తన ప్రసంగంలోని కొంత భాగాన్ని చూపించి వివాదం సృష్టించడం తనను కలిచివేసిందని ఖండించారు. తాను ఏ మతాన్ని, ఎవరి నమ్మకాలనూ కించపరచలేదని తెలిపారు. అన్ని మతాలను ఒకే రకంగా చూస్తాననీ, సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతానని పేర్కొన్నారు.

Spread the love