నేడు ఆర్టీసీ డయల్‌ యువర్‌ ఆర్‌ఎమ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ పరిధిలోని ఎమ్‌జీబీఎస్‌, జూబ్లీ బస్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి బయల్దేరే బస్సు సర్వీసులకు సంబంధించి ప్రయాణీకుల సమస్యల్ని పరిష్కరించేందుకు సోమవారం డయల్‌ యువర్‌ ఆర్‌ఎమ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్‌ఎమ్‌ ఏ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ 1,2, పికెట్‌, మియాపూర్‌-1, బీహెచ్‌ఈఎల్‌, పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ డిపోలకు సంబంధించిన సమస్యల్ని కూడా ప్రయాణీకులు ఫోన్‌ ద్వారా ఆర్‌ఎమ్‌కు నేరుగా చెప్పవచ్చు. సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య 99592 26241 నెంబర్‌కు ఫోన్‌ చేసి, ప్రయాణీకులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయవచ్చని తెలిపారు.

Spread the love