నేడు కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన

– హాజరుకానున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌
నవతెలంగాణ-గండిపేట్‌
దళితుల కమ్యూనిటీ భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ శుక్రవారం హాజరవుతారని కౌన్సిలర్‌ పత్తి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రూ. 40లక్షలతో నూ తనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను, ఎమ్మెల్యే పర్యటన ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నార్సింగిలోని 8వ వా ర్డులో సీసీరోడ్డు ప్రారంభంతో పాటు పలు ప్రారంభో త్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో నూతనంగా కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే రాక కోసం శానిటేషన్‌ కార్యక్రమాలను చేయిం చారు. కార్యక్రమంలో బస్తీవాసులు దుడ్డు అకాష్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ జనార్థన్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love