నేత్రపర్వంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ 47వ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రేణుకా దేవి జమదగ్నిల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఉత్సవ మూర్తులను పట్టణ పురవీధుల గుండా డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ మహిళలే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాన్ని, భక్తులు కట్న కానుకలు సమర్పించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన హైకోర్టు న్యాయవాది పెద్ద బచ్చాగారి రాంరెడ్డి కుటుంబ సభ్యులు, గౌడ సంఘ సభ్యులు సంయుక్తంగా పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘ అధ్యక్షుడు సిద్ధ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లింగాల స్వామి గౌడ్, పట్టణ ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love