ఎస్పీ సినిమాస్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరొందింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌లను అందిస్తున్న ఎస్పీ సినిమాస్ తెలుగు పరిశ్రమలోకి తొలి అడుగు వేస్తోంది. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనే నా’. ఆపిల్ ట్రీ స్టూడియోస్ పై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. ఇంతకముందు రాజ్‌శేఖర్ ‘జాంబీ రెడ్డి’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించారు. 1920, ప్రస్తుతం – రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సెట్ చేయబడిన ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నేనే నా’. రెజీనా కసాండ్రా ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషిస్తుంది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే మిషన్ సమయంలో మిస్టీరియస్ సంఘటనలకు దారి తీస్తుంది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, జయప్రకాష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోకుల్ బెనోరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్ కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది.