Skip to content
  • Sunday, October 1, 2023

  • రాష్ట్రీయం
    • తెలంగాణ రౌండప్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • మహబూబ్ నగర్
    • నల్లగొండ
    • ఆదిలాబాద్
    • రంగారెడ్డి
    • కరీంనగర్
    • మెదక్
    • వరంగల్
    • ఖమ్మం
    • నిజామాబాద్
  • సినిమా
  • ఆటలు
  • సోపతి
    • కవర్ పేజీ
    • కథ
    • సీరియల్
    • కవర్ స్టోరీ
    • అంతరంగం
    • సండే ఫన్
    • మ్యూజిక్ లిటిలేచర్
    • చైల్డ్ హుడ్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • రిపోర్టర్స్ డైరీ
  • ఫీచర్స్
    • దర్వాజ
    • దీపిక
    • వేదిక
    • మానవి
    • జోష్
    • బిజినెస్
  • ఈ-పేపర్
  • Home
  • Manavi
  • నోరూరించే క్రిస్‌మస్‌
Manavi

నోరూరించే క్రిస్‌మస్‌

December 21, 2022
6:40 pm

క్రిస్‌మస్‌ అంటేనే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. మరి నోరూరించే వంటకాలతో ఆ ఆనందాన్ని రెట్టించు చేయాలనుకుంటున్నారా? ఎప్పుడూ ఒకే రకం కేకులు ఏం తింటాం చెప్పండి. అందుకే ఈసారి కాస్త కొత్తదనం కోసం వీటిని ప్రయత్నించాల్సిందే.

శాంటా కుకీస్‌
కావల్సిన పదార్థాలు: మైదా – రెండు కప్పులు, చక్కెర – పావుకప్పు, పాలు – పావుకప్పు, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా, బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, చాక్లెట్‌ చిప్స్‌ – ఐదు.
కావల్సిన పదార్థాలు: ఓవెన్‌ను ముందుగా 325 డిగ్రీల వరకు వేడిచేసి పెట్టుకోవాలి. బటర్‌ను వేడిచేసి దాంట్లో పంచదార, పాలు, ఆ తర్వాత మైదా వేసి కలపాలి. దీంట్లోంచి కప్పు ముద్దను తీసుసుని పక్కన పెట్టుకోవాలి. మిగతా దాంట్లో ఎర్రని ఫుడ్‌కలర్‌ కలపాలి. దీంట్లోని పిండిని తీసుకుని అంగుళం, అర అంగుళం మందాన చిన్నచిన్న ముక్కల్లా చేసుకోవాలి. తెల్లని ముద్దలో నుంచి కొంత భాగాన్ని లడ్డూల్లా చుట్టాలి. ఎర్రని భాగాన్ని శాంతా శరీరంలా తయారు చేయాలి. తెల్లని ముద్దతో చేతులు, కాళ్లూ చేయాలి. చాక్లెట్‌ చిప్స్‌ను కండ్లలా అలంకరించాలి. మూడు చిప్స్‌ను ఒకదాని కింద మరొటి శరీరం మధ్యలో అంటిస్తే, అవి బటన్స్‌లా కనిపిస్తాయి. శాంతా సిద్ధం అయిన తర్వాత వీటిని కుకీషీట్‌ మీద ఉంచి పావుగంట పాటు బేక్‌ చేయాలి. అంతే శాంతా కుకీస్‌ రెడీ. ఇష్టమైతే ముఖం మీద కాస్త క్రీమ్‌ వేసుకుంటే అది శాంతా జుట్టూ, గడ్డంలా తెల్లగా ఉంటుంది.

గవ్వలు
కావల్సిన పదార్థాలు: మైదా, గోధుమపిండి, బొంబాయి రవ్వ – కప్పు చొప్పున, ఉప్పు – సరిపడా, వంటసోడా – చిటికెడు, బెల్లం – అరకేజీ, యాలకులపొడి – టీస్పూను, నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు.
తయారు చేసే విధానం: వెడల్పాటి గిన్నెలో మూడు రకాల పిండిలు, ఉప్పు, సోడా వేయాలి. నెయ్యిని వేడి చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలపాలి. దీని మీద మూతపెట్టి గంటసేపు పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి చిన్న ముద్దను తీసుకుని ఉండలా చుట్టుకోవాలి. చపాతీ కర్రకు నూనె రాసి దాని మీద ఈ ఉండను పెట్టి బొటనవేలితో నొక్కుకుంటూ వెళ్లాలి. కొత్త దువ్వెనతో కూడా గవ్వలను చేసుకోవచ్చు. కడాయిలో నూనె వేడిచేసి గవ్వలను తక్కువ మంట మీద గోధుమ రంగులోకి వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. బెల్లంలో పావుకప్పు నీళ్లు పోసుకుని కరిగించి పాకం పట్టాలి. దీంట్లో యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తీగపాకం వచ్చేంత వరకు ఉండి గవ్వలను దీంట్లో వేసి బాగా కలిపి తీసేయాలి.

క్రిస్మస్‌ ఫుడ్జ్‌
కావల్సిన పదార్థాలు: చాక్లెట్‌ చిప్స్‌ – ముప్పావుకప్పు, కండెన్సెడ్‌ మిల్క్‌ – లీటరు, వెన్న – నాలుగు టేబుల్‌ స్పూన్లు, క్రీమ్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, వెనీలా – టీస్పూను, ఉప్పు – పావు టీస్పూను, కుకింకగ్‌ స్ప్రే – కొద్దిగా, క్రిస్మస్‌ స్ప్రింకెల్స్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు.
తయారు చేసే విధానం: బేకింగ్‌ పాన్‌ మీద కుక్కింగ్‌ స్ప్రే చల్లి పేపర్‌ అతికించాలి. గిన్నెలో చాక్లెట్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, బటర్‌, క్రీమ్‌, వెనీలా, ఉప్పు వేసి తక్కువ మంట మీద కలుపుతూ కరిగించాలి. మూడు నిమిషాలపాటు ఓవెన్‌లో పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి పైన స్ప్రింకిల్స్‌ చల్లాలి. దీన్ని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత ముక్కల్లా కోసుకోవాలి.

బ్రెడ్‌ ఫుడ్డింగ్‌
కావల్సిన పదార్థాలు: చక్కెర – రెండు కప్పులు, మిల్క్‌ బ్రెడ్‌ స్లైస్‌లు – ఆరు, పాలు – కప్పున్నర, కస్టర్డ్‌ మిల్క్‌ పౌడర్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు.
తయారు చేసే విధానం: కడాయిలో చక్కెరను నీళ్లు పోయకుండా కరిగిస్తే క్యారమిల్‌ సిద్ధమవుతుంది. వేడిగా ఉండగానే దీన్ని గుండ్రని గిన్నెలోకి మార్చేయాలి. బ్రెడ్‌ ముక్కల చివర్లను తీసేసి మెత్తగా పొడి చేయాలి. అరకప్పు పాలల్లో కస్టర్డ్‌మిల్క్‌ పౌడర్‌ వేయాలి. పాలను వేడి చేసి దీంట్లో కొద్దిగా చక్కెర తర్వాత కస్టర్డ్‌మిల్క్‌ పౌడర్‌ కలిపిన పాలు పోయాలి. ఇప్పుడు తక్కువ మంటమీద కొద్దికొద్దిగా బ్రెడ్‌పొడిని వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధంగా ఉంచుకున్న క్యారమిల్‌ మీద వేయాలి. ఈ పాత్రను అల్యుమినియం ఫాయిల్‌తో మూసి నీళ్లు పోసిన పెద్ద పాత్రలో ఉంచి అరగంట పాటు ఉడికించాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి రెండుగంటల సేపు ఉంచాలి. తర్వాత గిన్నెను తలకిందులు చేసి ప్లేటు మీద బ్రెడ్‌ ఫుడ్డింగ్‌ను వేయాలి. చివరగా త్రికోణాకారంలో ముక్కల్లా కోసుకోవాలి.

గులాబీ పూలు
కావల్సిన పదార్థాలు: మైదా – కప్పు, బియ్యప్పిండి – కప్పు, పంచదార పొడి – కప్పు, కార్న్‌ఫ్లోర్‌ – పావుకప్పు, ఉప్పు – కొద్దిగా, యాలకుల పొడి – చిటికెడు.
తయారు చేసే విధానం: వెడల్పాటి గిన్నెలో మైదా, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, పంచదార పొడి వేసి నీళ్లు పోస్తూ చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి గంటసేపు పక్కన పెట్టేస్తే పంచదార బాగా కలుస్తుంది. దీంట్లో చిటికెడు యాలకుల పొడి, ఉప్పు వేసి రెండు, మూడు నిమిషాల పాటు కలపాలి. కడాయిలో నూనె వేడి చేయాలి. దీంట్లో గులాబీలు వేసుకునే గుత్తిని కూడా ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే పిండి గుత్తికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పిండి మిశ్రమంలో గుత్తిని మూడు వంతులు ముంచి తర్వాత నూనెలో ముంచి ఉంచితే గుత్తి నుంచి గులాబీ పువ్వు ఊడి వస్తుంది. దీన్ని తక్కువ మంట మీద దోరగా రెండు వైపులా వేయించి తీయాలి. ప్రతిసారీ గుత్తిని నూనెలో ముంచి తీస్తే గులాబీపూలు చక్కగా వస్తాయి.

Spread the love

Related posts:

womenఅసాధారణ వనితలు nuvvuluచలికాలం నువ్వుల రుచి women-వారి జీవితంలో ఊహించని మార్పు friendsస్నేహం నిలుపుకునే మార్గాలు jobకెరీర్‌లో ఎదగాలంటే..? sweetsసంక్రాంతి సకినాలు
Tags: christmas, Manavi

Post navigation

స్నేహం నిలుపుకునే మార్గాలు
ప్రముఖ గుట్కా వ్యాపారికి ఈడీ నోటీసులు

తాజా వార్తలు

another-shock-to-brs-is-mlc-joining-congress

బీఆర్ఎస్ కు మరో షాక్‌.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ

భారత్‌లోని ఎంబసీలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం : ఆఫ్ఘనిస్తాన్‌

amarajyoti-documentary-unveiled-by-ktr

అమరజ్యోతి డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

విమాన ప్రయాణికుడి దురుసు ప్రవర్తన..

టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు..

a-tearful-farewell-to-swaminathan

స్వామినాథన్‌కు కన్నీటి వీడ్కోలు

  AboutUs        ContactUs

Copyright © 2023 | NavaTelangana

Powered by DigiQuanta