కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంకహొ2012’. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేనిహొనిర్మిస్తున్నారు. సి.యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను విజరు దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ, ‘ష్యూర్ షాట్ హిట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఈ కథ చెప్పాలని, ఈ కథలో నేనూహొపార్ట్ అవ్వాలని అనిపించింది. ప్రేక్షకులు అందరినీ థియేటర్లకు రప్పించే సినిమా. ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ కథలో నేను చేయగలనని నమ్మి, సినిమాకు కావలసినట్టు చేసిన మా నిర్మాత బెన్నీకి థ్యాంక్స్’ అని తెలిపారు. ‘సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. టీజర్‌కు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని చెప్పారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ, ‘నిజాయితీగా చేసిన ప్రయత్నం ఇది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అకిరా కురుసోవాహొ’సెవెన్ సమురారు’లోనిహొఓ డైలాగ్ స్ఫూర్తితో ఈ కథ రాశా’ అని అన్నారు.