పరివేదలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ

నవతెలంగాణ-కోహెడ
మండలంలోని పరివేద గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఒకటవ వార్డులో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాడవాడలా సి సి రోడ్డు నిర్మాణానికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అనంతరం వార్డు సభ్యురాలు నాగేల్లి సౌజన్య అశోక్ ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్, సీనియర్ నాయకులు నాగరాజు, కొక్కుల సురేష్, ఎంపిటీసి వేముల శ్రీనివాస్, జాగిరి కుమారస్వామి, సర్పంచ్ లింగం గీతంజలి సీతారి, ఉప సర్పంచ్ గవ్వ వీరారెడ్డి, పి ఆర్ ఏ ఈ మజిద్, వార్డు సభ్యులు పెండ్యాల సంపత్ రెడ్డి, నాగేల్లి సౌజన్య అశోక్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏడబోయిన రాంచెంద్రం, కార్యదర్శి మమత, నాయకులు బొప్పనపల్లి రాజయ్య,పులి లక్షమయ్య, కొండా కనుకయ్య, అందే బాబు సుంకే బాలయ్య, సుంకే సంపత్, అందే శ్రీనివాస్, కొత్తపల్లి రాములు, లింగం చెంద్రయ్య, కాత సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love