నవతెలంగాణ-పాపన్నపేట
ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మహా శివరాత్రి జాతరను శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డితో కలిసి వనదుర్గా భవానీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భగుడి ముందు మంజీర నది పాయ మధ్యలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. శివుడి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆగ్రభాగాన ఉండేవిధంగా పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థించామన్నారు. ఈ సంవత్సరం రూ.రెండు కోట్లు కేటాయించామన్నారు.