మనఊరు-మనబడి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలుమార్చిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శేరిగూడ ప్రభుత్వ ప్రాథమికపాఠశాలలో రూ.12లక్షలతో చేట్టిన మరమ్మతులు పూర్తి చేసిన సందర్భంగా ఆయన సందర్శించారు. నూతన భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే మొదటి సారిగా మన ఊరు-మనబడి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూ. 7289.54 కోట్లు బడ్జెట్‌తో మొత్తం 26,065 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. మూడు దశలను పనులన్నీ పూర్తిచేసే విధంగా దిశా నిర్దేశం చేశారన్నారు. నియోజకవర్గంలో మిగిలిన పాఠశాలల్లో కూడా త్వరలోనే పనులు పూర్తి కానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, గ్రంథాలయ చైర్మన్ వెంకట రమణారెడ్డి, ఎంఈవో వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు తదితరులున్నారు.