పాత బస్తీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

– ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం పాత బస్తీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌ఓవైసీ కోరారు. ఉర్దూ అకాడమీ, ఉర్దూ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల్లోని ఉర్దూ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశ పెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 22 రోజులు నిర్వహించాలంటూ స్పీకర్‌కు ఎంఐఎం లేఖ రాసిందని గుర్తు చేశారు. స్వల్పకాలిక చర్చలో 25 అంశాలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఎనిమిది రోజుల్లోనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను విజయవంతంగా నిర్వహించారంటూ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావును ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి,కొకైన్‌, కల్తీ నూనె తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీటితో యువత పెడదోవ పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్లను అడ్డగోలుగా రాస్తున్నారనీ, వాటి ప్రభావం తీవ్రంగా ఉంటోందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.
పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి
                                                                             సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
పత్తి కొనేందుకు కేంద్రం వెనకడుగు వేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ యా రైౖతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిరుద్యోగ భృతి, ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు, వీఆర్‌ఏలకు పేస్కేల్‌, సర్పంచులకు నిధులు ఇచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరారు, సేవాలాల్‌మహారాజ్‌ జయంతికి సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు. ఇంటిజాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్ష లు అందజేయాలని డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ నుంచి సదాశివపేట్‌ వరకు మెట్రోను పొడిగించాలని కోరారు. చేపలు అమ్ముకునే వారి కోసం ఔట్‌లెట్లు ఏర్పా టు చేయాలన్నారు. పోడు భూముల పంపిణీకి సంబంధించిన తేదీని ప్రకటించా లని కోరారు.జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు. విద్య, వైద్యానికి నిధులు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం గా నీటి కేటాయింపులు జరగడం లేదనీ, పార్టీలకు అతీతంగా పోరాడాలని సూ చించారు. అందుకు తాము కలిసి వస్తామన్నారు. కరోనా నియంత్రణ లో కేంద్రం విఫలమైందన్నారు. ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు ప్రభుత్వ ఆస్తులను కూడబెడితే. మోడీ అధికారంలోకి వచ్చాక అమ్ముతున్నా రని విమర్శిం చారు. నెహ్రూ స్ఫూర్తివంతమైన పాలనను ఇప్పటిపాలకులు కొనసాగించాలని కోరారు.

Spread the love