పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

నవతెలంగాణ – ఢిల్లీ
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  తన ప్రసంగంతో పార్లమెంట్‌ సెషన్స్‌ను ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌, ఆప్‌ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.

Spread the love