పాలకుర్తి నుండి పట్నం వరకు పాదయాత్ర

-సీఐటీయూ రాష్ట్ర ప్రధాన
– కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-దేవరుప్పుల
గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 12 నుండి 28వ తేదీ వరకు పాలకుర్తి నుండి పట్నం వరకు జరిగే పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఉద్యోగ కార్మికులను, ప్రజలను కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని అఖిల గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బత్తిని వెంకన్న అధ్యక్షత జరిగిన గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల మాదిరిగానే గ్రామపంచాయతీ కార్మికులకు కూడా రూ.15.600 ఇవ్వాలని అన్నారు. పీఎఫ్‌,ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మల్టీ పర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. కేటగిరీల వారీగా పని విధానం అమలు చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపాలని కోరారు. తెలంగాణలో గ్రామపంచాయతీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలు స్థానికులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో జిపి యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య రాష్ట్ర అధ్యక్షులు పాండు నాయకులు పాలడుగు సుధాకర్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు,జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్‌, సిఐటియు గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నా రోజు రామచంద్రు,జిల్లా కోశాధికారి సుంచు విజేందర్‌,జిల్లా మండలాల నాయకులు బస్వ రామచంద్రం, గనగాని ఉప్పలయ్య, రామ్‌నారాయణ, కష్ణ, లాజర్‌,బోస్‌, రాజు,వెంకట్‌ రెడ్డి,స్వరూప, సోమయ్య,నర్సింహ, దయాకర్‌,పైండ్ల వెంకటరమణ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love