పిస్తా తినండి

–  వెల్నెస్‌ ఎక్స్‌పర్ట్‌ నైనీ సెతల్వాద్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆరోగ్య పరిరక్షణ కోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగిన ‘కాలి ఫోర్నియా పిస్తా’ను ప్రజలు నిత్యం స్నాక్స్‌గా తీసుకోవాలని ప్రముఖ న్యూట్రీషనిస్ట్‌, వెల్నెస్‌ నిపుణురాలు నైనీ సెతల్వాద్‌ సూచించారు. సహజం గా జంతు సంబంధ ఆహారాల్లో ఉండే పూర్తిస్థాయి ప్రోటీన్లు అన్నీ ‘పిస్తా’లో ఉన్నాయనీ, ఇవి శాఖాహారులకు అత్యు త్తమ ఆరోగ్య ప్రత్యామ్నాయ ఆహారం గా ఉపయోగపడుతుందని చెప్పారు. అమెరికన్‌ పిస్తా గ్రోవర్స్‌ (ఏపీజీ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన నాలెడ్జ్‌ సెషన్‌లో ఆమె మాట్లాడారు. ఇతర గింజల ఆహారంతో పోలిస్తే, పిస్తాలో కేలరీలు తక్కువగా ఉంటా యనీ, వీటిని ఎప్పుడైనా స్నాక్స్‌గా తీసుకోవచ్చని తెలిపారు. పిస్తా… శరీరంలో ఆరోగ్య కణాలను ప్రీ రాడి కల్‌ డ్యామేజ్‌ నుంచి రక్షిస్తుందనీ, ఇది తింటే ఒళ్లు వస్తుందనేది పూర్తిగా అపోహా మాత్రమేనని స్పష్టం చేశారు. అధిక బ్లడ్‌ షుగర్‌తో బాధపడుతున్న వారికి పిస్తా గొప్ప సప్లిమెంటరీగా ఉపయోగపడుతుందని వివరించారు.

Spread the love