పెద్ద ఎక్లారా గ్రామంలో బీజేపీ పార్టీ గడపగడపకు ప్రచారం

– బీజేపీని గెలిపించండి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో ఆదివారం నాడు బీజేపీ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరుణా తార మాట్లాడుతూ బీజేపీని గెలిపించండి వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి సహకరించండి అంటూ ప్రజలకు ఇంటింటా ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా అభివృద్ధిని కొనసాగిస్తున్నారని నరేంద్ర మోడీ నీ బలపరిచి జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి చట్లవర్ హన్మండ్లు కొండా వీరేశం, కృష్ణ పటేల్, విఠల్ సార్, మల్లికార్జున్ దేశాయ్, రాము, సంతోష్, చెంద్రకంత్ట్, అశోక్, పెద్ద కొడప్ గల్ మండల బీజేపీ నాయకులు గంగాధర్, సదం నాగరాజ్, ముధ్ రాజ్, రాజు, బొన్లవార్, విష్ణు, చిన్న గౌడ్ బిచ్కుంద విష్ణు పెద్ద ఎక్లారా గ్రామస్తులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love