లిమా : పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వాయువ్య పెరూలోని పియురా ప్రావిన్స్‌లో ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. కొరియంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు పెరూ రాజధాని లిమా నుండి బయలుదేరిన బస్సు ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ‘ డెవిల్స్ కర్వ్ ‘ అని పిలువబడే కష్టమైన ప్రదేశంలో ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో హైతీకి చెందినవారు కూడా ఉన్నట్టు తెలిపారు.