– ఫౌండేషన్ చైర్మెన్ పెద్ద శంకర్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
పేదలకు అండగా రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ పెద్ది శంకర్ గౌడ్ అన్నారు. నిలోఫర్ హాస్పిటల్ ఆవరణలో రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోగులకు వారితో వచ్చే సహాయకులకు(సుమారు 500 మంది) ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. ఎనో ఒల్డ్ ఏజ్ హౌమ్ గత 5 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నుంచి పేదలకు అన్ని విధాలా సేవ చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ది శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిడికెడు కూడు లేని వారికి గంజినీళ్లు పరమాన్నం.. ఒక ముద్దా అన్నం దొరికితే పరమానందం అన్నారు. ఉంది కదా అని ఆహారాన్ని వృథా చేయొద్దని.. మీరు పారేసే మెతుకులు కూడా దొరకని వాళ్లు చాలామంది ఉన్నారని, ఆహారం వథా చెయ్యకుండా దానం చెయ్యాలని సూచించారు. ఈ రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ తరుపున ప్రతీ ఆదివారం ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. రాధ మనోహర్ దాస్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఇలా ప్రతీ ఆదివారం పేద రోగులకు ఆహారం సరఫరా చేస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రెసిడెంట్, తెలంగాణ బీసీ యూత్ వింగ్, బీఆర్‌ఎస్, స్టేట్ యూత్ వింగ్ లీడర్ మత్తరాజు యదవ్ పాల్గొని మాట్లాడారు. ఇలా ప్రతీ ఆదివారం గవర్నమెంట్ హాస్పిటళ్ల దగ్గర లేదా జన సమూహం ఉన్నచోట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే ఆకలితో అలమటిస్తారో అలాంటి వారికి తాము ఉన్నాము అని రెడి టూ సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెద్ది శంకర్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం అందించాలనుకుంటే ఫౌండేషన్ కాంటాక్ట్ నెంబర్, ఫోన్ పే నెంబర్ 9701295527కు సహాయం చేయవచ్చు అన్నారు. రెడీ టూ సర్వ్ ఫౌండర్, సంస్థ కో ఆర్డినెటర్ ప్రకాష్, చైతన్య, రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ టీం మెంబెర్స్ , పీఆర్వో లక్ష్మణ్ , నవీన్, రాజు, శ్రీను రామయ్య ప్రశాంత్ పాల్గొన్నారు.