పోలీసులు అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ నాయకుల పోరాటాన్ని ఆపలేరు

– జిల్లా పోలీసులకు కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
నవతెలంగాణ-కంటేశ్వర్
పోలీసులు అక్టేరమ అరెస్టులతో కాంగ్రెస్ నాయకుల పోరాటాన్ని ఉద్యమాలను ఆపలేరని నిజామాబాద్ జిల్లా పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ లు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి రోజు(శనివారం) నిజామాబాద్ జిల్లా కార్యక్రమాలకు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి మెమోరండం ఇవ్వడానికి వెళ్లిన అదే శాఖకు సంబంధించిన కార్పొరేటర్ గడుగు రోహిత్ ను పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ అరెస్టు చేసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది పోలీసుల యొక్క అతిఉస్తాహానికి, అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని చెప్పడానికి నిదర్శనమని ఆయన తెలియజేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మంత్రులకు ప్రజల యొక్క సమస్యలపై వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంటుందని కానీ ఈ జిల్లాలో జిల్లాకు మంత్రి వచ్చిన, టిఆర్ఎస్ నాయకులు వచ్చిన, మంత్రి ఇంట్లో కుక్క వచ్చిన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, కేటీఆర్ చేసిన మంచి పనులు చెప్పే అవకాశం ఆయనకు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను అడిగే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుందని కానీ పోలీసు యంత్రాంగం ఒకరోజు ముందు రాత్రి నుండే కాంగ్రెస్ నాయకులను, యువకులను, విద్యార్థులను చివరికి మహిళలను అరెస్టు చేయడానికి పోలీసులకు సిగ్గుండాలి అని, పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం ద్వారానే కాంగ్రెస్ నాయకులు మంత్రిని అడ్డుకోవడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ నాయకులు బయట తిరిగే వారని ఆయన అన్నారు.
జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరని మీరు చేసే మా అక్రమ అరెస్టుల ద్వారా మీరు చేసే అవినీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేయకుండా ఆపలేరని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను అదే శాఖకు సంబంధించిన మంత్రికి తెలియజేయడానికి వెళ్లిన కార్పోరేటర్ రోహిత్ ను అరెస్టు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, సమస్యలపై వినతులు ఇచ్చే అవకాశం ప్రతిపక్ష పార్టీలకు కల్పించాలని అంతేకానీ అరెస్టులు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్బీన్ హంధాన్ మాట్లాడుతు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ప్రజల యొక్క సమస్యలను అధికార పార్టీకి వినతి రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుందని, కానీ దానికి భిన్నంగా నిజామాబాద్ జిల్లాలో ప్రజల సమస్యల పట్ల ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని, నిన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు అదే శాఖ మున్సిపాలిటీ కార్పొరేటర్ రోహిత్ కు ఆహ్వానం ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీ కమిషనర్ ది కలెక్టర్ దని, పట్టణ సమస్యల పట్ల మంత్రి కి మెమోరండం ఇవ్వడానికి వెళుతున్న సందర్భంగా రోహిత్ ను అరెస్టు చేయడం ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని, రోహిత్ నక్సలైట్, టెర్రరిస్టు కాదని ఒక న్యాయవాది అని ,కాంగ్రెస్ పార్టీకి కేసులు కొత్త కాదని దేశ స్వాతంత్రం కోసం ఏందో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడానికి ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఇది మళ్ళీ పునర్వృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లా కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ నాయకులను టెర్రరిస్టుల్లాగా భావించి ముందస్తు అరెస్టులు చేశారని, అందులో భాగంగానే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ను ముందస్తు అరెస్టు చేయడానికి ఇంటికి వస్తే వారు అందుబాటులో లేరని ఒకవేళ వచ్చినా అదే శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి మున్సిపాలిటీలో జరుగుతున్న సమస్యలపై వినతి పత్రం ఇస్తాడని చెప్పిన పోలీసులు వినకుండా ఇంటి చుట్టూ పోలీసులు బలగాలను పెట్టి ప్రజలను భయభ్రాంతులకు చేశారని ఆయన అన్నారు. నల్ల జెండాలతో నిరసన తెలపడానికి వెళ్లిన రోహిత్ ను అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అతి ఉత్సాహంతో దౌర్జన్యంగా బలవంతంగా కారులో కూర్చోబెట్టారని ,పోలీసులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి అక్రమంగా మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారని కేసులు పెట్టారని ఆయన అన్నారు. గతంలో రోహిత్ బస్సును ఆపినప్పుడు 353 కేసు పెట్టారని, ఇటీవల కలెక్టర్ ఆఫీస్ వెళ్తే ఏ అధికారిని కూడా కాంగ్రెస్ నాయకులు తాకలేదని అయినా కూడా 353 కేసు పెట్టారని, అదేవిధంగా నిన్న కూడా మంత్రి కాన్వాయ్ అడ్డుకున్నారని 353,332 కేసు పెట్టారని ఏ కేసులు పెట్టాలో కూడా తెలియని పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతున్నారని అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా నిరసనలు తెలిపినప్పుడు ఏ అధికారిని కూడా తాకలేరని 353 అనేది అధికారులకు విధులకు అడ్డు పడినప్పుడు గానీ, అధికారులపై దౌర్జన్యం చేసినప్పుడు గాని పెట్టేదని ,కానీ కేవలం టిఆర్ఎస్ నాయకుల మెప్పు కోసం కాంగ్రెస్ నాయకుల పై కేసులు పెడుతున్నారని, భారత రాజ్యాంగం ప్రకారం 19(1)A,10(1)B,19(1)C ఈ సెక్షన్ల ద్వారా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని దాని ప్రకారమే నిన్న వారు నిరసన తెలిపారని, 41(ఏ) సి ఆర్ పి సి కింద వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ఆయన కోర్టుకు హాజరు కాలేడు అని అనుకున్నప్పుడు రిమాండ్ కు పంపాలని, కానీ గడుగు రోహిత్ నిజామాబాద్ వాసి, ఒక న్యాయవాది , ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక కార్పొరేటర్ అయినా కూడా ఆయనకు 41(ఏ) సి ఆర్ పి సి కింద బెలు ఇవ్వకుండా రిమాండ్ కు పంపి ఈ సెక్షన్లను పోలీసులు ఉల్లంఘించారని దీనిపై మేము సీనియర్ నాయకులతో, న్యాయవాదులతో చర్చించి కంటెట్మ్ కు వెళ్తామని ఆయన అన్నారు. గతంలో అర్నేష్ కుమార్ కేసులో 41(ఏ) సిఆర్పిసి సెక్షన్ కింద హైకోర్టు రూలింగ్ ను సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఆయనకు రూలింగ్ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిన్న టెర్రరిస్టు లాగా నక్సలైట్ల లాగా యువకులు ఐదుగురిని అరెస్టు చేసి అందులో ఉన్న ఒక మైనర్ బాలుడిని కూడా ఎంత చెప్పిన వినకుండా అరెస్టు చేసి రిమాండ్కు పంపడం అనేది కాంగ్రెస్ నాయకుల పై కక్ష సాధింపు చర్య అని మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించారని ఆయన అన్నారు.
డ్రామ రాజకీయాలు మానేసి పోలీసులు నిజాయితీగా ఉద్యోగాలు చేయాలని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కేసులు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్ ,నిజామాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, నగర ఎస్టి సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, కైసర్, నిఖిల్ రెడ్డి ,చింటూ తదితరులు పాల్గొన్నారు.

Spread the love