నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కునేలా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని ఆ సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమాలకర్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ బోర్డు చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, పౌరసరఫరాల సంస్థ సీఎండీ వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొని రవీందర్ సింగ్కు అభినందనలు తెలిపారు.