ప్రజలందరికీ సహకారాన్ని అందిస్తా

-మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్‌
ప్రజందరికీ అందుబాటులో ఉండి, తనవరకు సాధ్యమైనంత సహకారం ఎల్ల వేళలా అందిస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం చిల్పూర్‌ మండలం రాజవరం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యం లో మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ దేవతలకు పట్నాలు సమర్పించే సందర్భంగా ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కడియం యువసేన ఆధ్వర్యం లో బాణసంచా పేల్చి ఘనంగా కడియంను ఆహ్వానించారు. ఆ దేవుని దీవెనలతో పాటు మీ అన్నదండలు మాకు ఉండాలని కమ్యూనిటీ భవనం ఎల్లమ్మ దేవాల యం నిర్మాణానికి సహకారం అందించాలని యాదవ సంఘం నాయకులు కోరా రు. ఈ మేరకు కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామ ప్రజలనుచల్లగా చూడాల ని, ఆ దైవ దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకున్న ట్లు తెలిపారు. గతంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తమ ఆధ్వర్యం లో జరిగాయని అన్నారు. మీరు కోరిన విధంగా నా సాయశక్తులా సహకారం అం దిస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ భవనం కోసం తన సొంత నిధులతో 15 రోజుల్లో మంజూరి ఇప్పిస్తానని,సంబంధిత వివరాలతో సంప్రదించినట్లైతే, త్వరిత గతిన పూర్తి అవుతుందని సూచించారు. అనంతరం లింగంపల్లి గ్రామంలో గీతా కార్మికుడు ఈదులకంటి కుమారస్వామి, చిల్పూర్‌ మండలకేంద్రంలో మాజీ సర్పం చ్‌ తోట రాజయ్య తల్లి కొమురమ్మ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ మారేపల్లి తిరుమల, క్రిష్ణా మోహన్‌ రెడ్డి, ఎంపిటిసి మారేపల్లి లలితా దేవి, శ్యాం కుమార్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ సంతోష్‌ యాదవ్‌, కుల పెద్దలు కన్నెబోయిన కొమురయ్య, గట్ట య్య, కిష్టయ్య, శ్రీశైలం, సారయ్య, వీరస్వామి, వైస్‌ ఎంపిపి భూక్య సరితా నర్సిం హ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఎదునూరి రవీందర్‌, లోడెం రజిత రవీందర్‌, ఉద్ధేమారి రాజ్‌ కుమార్‌, కొంగరి రవి, నాయ కులు సూర్య నారాయణ, కడియం యువసేన గ్రామ అధ్యక్షులు ఎడ్ల ప్రశాంత్‌, ఉప అధ్యక్షులు ఎడ్ల శ్రీను, ప్రశాంత్‌, రాజు, శ్రీకాంత్‌, నరేష్‌, చిరంజీవి, సందీప్‌, సంపత్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love