ప్రజా ఆమోదంగా బడ్జెట్

-బీఆర్ఎస్ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
వైద్య ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజా ఆమోదంగా బడ్జెట్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90, 396 కోట్ల ఈ బడ్జెట్ ప్రజలందరి ఆశలు, ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చేదిగా ఉందని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్ అన్నారు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలు, దూరదృష్టి ప్రజలకు మేలు చేసేదిగా ఉందని తెలిపారు. బడ్జెట్ లో పేదోడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బడ్జెట్లో మైనారిటీ, ఎస్సీలు, ఎస్టీల కు, బీసీలకు పెద్ద మొత్తం బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. దేశంలో ఇలాంటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ప్రప్రథమంఅనిఅన్నారు.

Spread the love