ప్రజా ప్రయోజనా దృష్టితో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరగలేదు

– మున్నూరు కాపుసంఘం నియోజకవర్గం కన్వీనర ఆవుల శ్రవణ్‌ కుమార్‌
– అఖిలపక్ష పోరాటానికి సంపూర్ణ మద్దతు
– ఫ్లైఓవర్‌ను మల్లికా కన్వెన్షన్‌
– వరకు పొడిగించాలని డిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
మెరుగైన సులభతరమైన రవాణా సౌకర్యం కోసం వందల కోట్లతో చేపట్టిన నేషనల్‌ హైవే-44శంషాబాద్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని మున్నూరు కాపు సంఘం రాజేంద్రనగర్‌ నియోజకవర్గం కన్వీనర్‌ ఆవుల శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. శంషాబాద్‌లో నేషనల్‌ హైవేపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని సిద్ధాంతి గ్రా మం నుంచి మల్లికా కన్వెన్షన్‌ వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ‘బ్రిడ్జి బడావో శంషాబాద్‌కు బచావో’ నినాదంతో నిన్నటి నుంచి సిద్ధాంతి ముదిరాజ్‌ సంఘ భవనం వద్ద చేపట్టిన రిలే నిరసన దీక్షలు రెండో రోజుకు చేరాయి. ప్రజా సౌకర్యం కోసం అఖిలపక్ష జేఏసీ నేతలు చేపట్టిన రిలే నిరసన దీక్షలకు మద్దతుగా శంషాబాద్‌ ము న్నూరు కాపు సంఘం నాయకులు, మండల యాదవ సం ఘం నాయకులు బుధవారం రిలే నిరసన దీక్షలో కూర్చుని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ము న్నూరు కాపు సంఘం నియోజకవర్గం కన్వీనర్‌ ఆవుల శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ శంషాబాద్‌ నేషనల్‌ హైవే రోడ్డు దాటడం అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిందన్నా రు. పోలీసులు వీఐపీల రాకల కోసం ప్రత్యేక చర్యలు తీ సుకుంటూ ఉండడంతో సామాన్య జనం స్థానిక వాహన దారులు బెంగళూరు హైవేపై వెళ్లే వాహనాలు తీవ్ర అ సౌకర్యానికి గురికావడం జరుగుతుందన్నారు. పాత శం షాబాద్‌ కొత్త శంషాబాద్‌ మధ్య రాకపోకలకు అనేక ఆటం కాలు ఏర్పడుతూ వస్తున్నాయని తెలిపారు. ట్రాఫిక్‌ సమ స్యలను సులభతరం చేసేందుకు ఇప్పుడు నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. అయితే ఈ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో జరిగిన లోపాల కారణంగా శంషాబాద్‌ గతంలో కన్నా కూడా రాకపోకలకు తీవ్ర ఆ టంకం కల్గుతుందన్నారు. సమస్య తీవ్రంగా ఉన్న చోటనే ఫ్లై ఓవర్‌ ఎంట్రెన్స్‌ ఏర్పాటు చేయడంతో ప్రజలు రోడ్డు దాటడం అసాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. స్వార్థ రాజకీ య ఒత్తిళ్లకు ప్రభుత్వ అధికారులు లొంగిపోవడంతోనే వేలాది మంది ప్రజల ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడింద న్నారు. ఒకవేళ ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రోడ్డు దాటడం కష్టంగా మారుతుందన్నారు. ఇప్పుడున్న ఫ్లైఓవర్‌ సిద్ధాంతి గ్రామం నుంచి మల్లికా కన్వెన్షన్‌ వరకు పొడిగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. న్యాయమైన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పొడిగింపు పోరాటానికి తమ సంపూర్ణ మద్దతుతో పోరాటంలో భాగస్వాములు అవుతామన్నారు. కార్య క్రమంలో మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ కే. సుష్మ మహేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌ యాదవ్‌ డాక్టర్‌ ప్రేమ్‌ రాజ్‌, చింతల నందకిషోర్‌, కౌన్సిలర్‌ మేకల వెంకటేష్‌ , కొనమోళ్ల దేవేందర్‌, బొబ్బిలి కృష్ణ, బొబ్బిలి చంద్రశేఖర్‌, వీరమల్ల హనుమంతు, జీవై.ప్రభాకర్‌, చేవెళ్ల ప్రసాద్‌, నాన్నవాళ్ళ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love