ప్రధాని మోడీ పర్యటన వాయిదా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. బుధవారం ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని రాష్ట్రంలో పర్యటించే షెడ్యూల్‌ త్వరలో మళ్లీ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఈ నెల 19న ప్రధాని మోడీ రావాల్సి ఉండగా ఆ పర్యటన వాయిదా పడింది. లోక్‌సభ స్థానాల ప్రభారీలతో బన్సల్‌ సమావేశం లోక్‌సభ స్థానాల ప్రభారీలు, కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లతో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునిల్‌ బన్సల్‌ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతంపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సింబల్‌ మాత్రమే గోడల మీద ఉండా లనీ, నేతల ఫొటోలు కాదని స్పష్టం చేశారు. శక్తి కేంద్రాల వారీగా జరిగే కార్నర్‌ మీటింగ్‌లకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యే వారితోనే నిర్వహించాలని సూచిం చారు. ప్రతి మీటింగ్‌నూ 3 వందల నుండి 5 వందల మందితో నిర్వహించాల న్నారు. ఈనెల 29లోపే బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Spread the love