ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆశ వర్కర్ల ధర్నా

నవతెలంగాణ-భిక్కనూర్
ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని  మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి ముందు  ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు ప్రతి ఇంటికి తిరుగుతూ  వైద్య సేవలు నిర్వహిస్తున్న  ప్రభుత్వం ఇప్పటివరకు కనీస వేతనం అమలు చేయలేదని,  దీనికి తోడు కంటి వెలుగు  కార్యక్రమంలో పని భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు.  చాలీచాలని  జీతాలతో తమ జీవితాన్ని నెట్టుకొస్తున్న  ఆశా వర్కర్లకు  రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని  డిమాండ్ చేశారు.

Spread the love