ప్రభుత్వ వైఫల్యాలను  కప్పిపుచ్చుకునే ప్రయత్నం

– హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. 24 గంటలు ఉచిత కరెంటు అని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ చెప్పిన విషయం శుద్ధ అబద్ధం అన్నారు. దళిత ప్రాంతాల్లో రాత్రిపూట కరెం టు తీసి వాళ్లు అన్నం తినకుండా చేస్తున్నారని, లాండ్రీ, సెలూన్‌ షాపులకు వంద యూనిట్లలోపు ఉచిత కరెంటు ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేద న్నారు. అది నిజామా? కాదా తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడ కుండా ప్రయత్నం చేస్తున్నారని, దమ్ముంటే ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వాలన్నారు. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వంపై నింద వేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పోషించే సత్తా హైదరాబాద్‌కు ఉండేదని, మరి ఇప్పుడు నిధుల కొరత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దేశంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమేనన్నారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావడం లేదని, సర్పంచులు, ఉపసర్పంచులు చిన్న పనులు చేస్తున్నా బిల్లులు రావడం లేదన్నారు. స్పీకర్‌ను అడ్డుపెట్టుకొని సంఖ్యా బలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం మంచిది కాదన్నారు. అలా చేసినవారు కాల గర్భంలో కలిసి పోయారని గుర్తుచేశారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్నారు.

Spread the love