నవతెలంగాణ-భిక్కనూర్
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బైని కొండల్ రెడ్డి(43) తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఉదయం వరికి నీరు పెట్టేందుకు బోరు మోటర్ వద్ద స్టార్టర్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన అతని సోదరుడు బాపురెడ్డి కొండల్ రెడ్డి బతికి ఉన్నాడని ఆశతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహాత్మా గాంధీ గౌడ్ తెలిపారు.