ప్రారంభమైన స్టార్టప్‌-20 సమావేశం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత జీ-20 అధ్యక్షత సంబంధిత చర్చల బందం ‘స్టార్టప్‌-20’ తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బందం చైర్మెన్‌ డాక్టర్‌ చింతన్‌వైష్ణవ్‌ ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి అనురాగ్‌జైన్‌, నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పరమేశ్వరన్‌ అయ్యర్‌ కీలక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఉపన్యాసాలు చేశారు. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love