ప్రేక్షకులకు కొత్త రంగుల ప్రపంచం

ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో, మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్‌ నటుడు, 30 ఇయర్స్‌ ఇండిస్టీ పధ్వీ రాజ్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. పధ్వీరాజ్‌, క్రాంతి కష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్‌ కుమార్‌, గీతాసింగ్‌, కష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్‌ నవీన్‌, జబర్దస్త్‌ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్‌ రెడ్డి, కుర్రి కష్ణా రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్‌ను చిత్రబదం రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో పృధ్వీ మాట్లాడుతూ,’ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఒక సీన్‌ను మొదలుపెట్టేముందు డీఓపీతో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. సంగీత దర్శకుడు అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చారు’ అని తెలిపారు. ‘టెక్నీషియన్స్‌ అందరూ 100% వర్క్‌ చేశారు. ఇది నా మొదటి సినిమా. నిర్మాతలు న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడం చాలా గ్రేట్‌. సీనియర్‌ నటులతో సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని హీరో క్రాంతి కష్ణ అన్నారు.
హీరోయిన్‌ శ్రీలు మాట్లాడుతూ,’ఈ సినిమా కోసం అందరూ వాళ్ళ బెస్‌ ఎఫెర్ట్‌ ఇచ్చారు. మా నాన్న దర్శకత్వంలో నేను ఈ సినిమా చేయటం లక్కీగా ఫీల్‌ అవుతున్నాను.అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’ అని చెప్పారు.
 ఈచిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ : శ్రీ  సంగీత ఆదిత్య, కెమెరామెన్‌ : శివారెడ్డి.   

Spread the love